Thursday, March 28, 2024
Homeసినిమా'ఎన్టీఆర్ 30' స్పెషల్ వీడియో వచ్చేస్తోంది

‘ఎన్టీఆర్ 30’ స్పెషల్ వీడియో వచ్చేస్తోంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మూవీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ… ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది క్లారిటీ లేదు. ఇటీవలే ఈ సినిమా నిర్మాణంలో భాగమైన యువసుధ ఆర్ట్స్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించారు, దీనితో ఇక పై వరుసపెట్టి అప్ డేట్స్ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా సినిమా షూటింగ్ తో పాటు ఇతర వివరాల్ని తెలియచేసేలా స్పెషల్ గా ఓ వీడియోను రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. దీని కోసం ఎన్టీఆర్ పై స్పెషల్ గా షూటింగ్ చేసి మరీ విడుదల చేయబోతున్నారు.

ఇంతకు ముందు ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో జనతాగ్యారేజ్ అనే బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈసారి పాన్ ఇండియా సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు. జనవరి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ఎన్టీఆర్ 30 లో డ్యూయర్ రోల్..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్