Saturday, June 13, 2026
Homeసినిమావీరసింహారెడ్డి’ ‘సుగుణ సుందరి’ పాటకు ముహర్తం ఫిక్స్

వీరసింహారెడ్డి’ ‘సుగుణ సుందరి’ పాటకు ముహర్తం ఫిక్స్

 నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.  ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ని డిసెంబర్ 15న విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించగా,  సమయాన్ని కూడా…  ఉదయం 9:42 గంటలకు విడుదల  అని తెలిపారు.

ఓ లవ్లీ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ ప్రకటన చేశారు. పోస్టర్‌లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించబోతుతున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రం కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఫస్ట్ సింగిల్ జై బాలయ్యకు అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తుండగా,  సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్;  నవీన్ నూలి ఎడిటర్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular