Sunday, June 14, 2026
Homeసినిమాటాలీవుడ్ దర్శకుడుతో సల్మాన్ ఖాన్ మూవీ..?

టాలీవుడ్ దర్శకుడుతో సల్మాన్ ఖాన్ మూవీ..?

పవన్ కళ్యాణ్‌ తో సినిమా అంటే.. అది ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాని స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై పవర్ స్టార్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే… ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్‌ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ప్రకటించి సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో హరీష్ ఏం చేయాలో తెలియక చాలా రోజులు టెన్షన్ గా ఫీలయ్యారు. ఇప్పుడు ఇక లాభం లేదనుకుని వేరే హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ ఎవరా బాలీవుడ్ స్టార్ అంటే.. సల్మాన్ ఖాన్ అని తెలిసింది.

గతకొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ తో హరీష్ శంకర్ చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని సల్మాన్ తో ఎలాగైనా ఫైనల్ చేయించుకోవాలనే ఆలోచనతో దర్శకుడు హరీష్  సల్మాన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట. ప్రస్తుతం తనని ఒప్పించడానికి హరీష్ శంకర్ ముంబై వెళ్లినట్టుగా తెలుస్తోంది. హరీష్ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఓకే అంటే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. మరి.. సల్మాన్ హరీష్ కి ఓకే చెబుతారో లేదో చూడాలి

Also Read : పవన్ నిర్ణ‌యంతో హరీష్ శంకర్ కు దడ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular