Sunday, January 19, 2025
HomeTrending Newsచిరూ .. బాలయ్య కాంబోను నేనే చేస్తాను: రాఘవేంద్రరావు

చిరూ .. బాలయ్య కాంబోను నేనే చేస్తాను: రాఘవేంద్రరావు

‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ‘అన్ స్టాపబుల్ 2’ కూడా జోరుగానే కొనసాగుతోంది. రీసెంట్ గా ఈ టాక్ షోలో అల్లు అరవింద్ .. సురేశ్ బాబు .. రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్లు .. ఇద్దరు సీనియర్ టాప్ డైరెక్టర్లు ఒకే వేదికపై కనిపించడం అరుదైన విషయం. ఈ నలుగురితోను కలిసి బాలయ్య తనదైన స్టైల్లో సందడి చేశారు. ‘ ఆ నలుగురు’ గురించి ఇండస్ట్రీ అనుకుంటున్న విషయాలపై కూడా ఆయన ఈ ఇద్దరు నిర్మాతలను సూటిగా ప్రశ్నించారు. ‘ ఆ నలుగురు’ అంటూ కొంతమంది చిత్రీకరించారనీ, తెలుగు సినిమాను బ్రతికించడమే తమ ఉద్దేశమని అల్లు అరవింద్ సమాధానమిచ్చారు.  సురేశ్ బాబు నిర్మాణంలో వెంకటేశ్ హీరోగా చేసినప్పుడు … అల్లు అరవింద్ నిర్మాణంలో బన్నీ హీరోగా చేసినప్పుడు పారితోషికాలు ఇస్తారా? అంటూ బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు. ఈ విషయంలో ఎలాటి మినహాయింపులు ఉండవనీ, పద్ధతి ప్రకారం .. మార్కెట్ ప్రకారం ఎవరి పారితోషికం వారికి ముందుగానే వెళుతుందని చెప్పారు. తాను మాత్రం సినిమా రిలీజ్ కి ముందే బన్నీ కి ఇవ్వవలసిన పేమెంట్ ను పూర్తిగా అందేలా చేస్తానని అల్లు అరవింద్ నవ్వేశారు. గీతా ఆర్ట్స్ లో తనతో సినిమా చేయరా? అని బాలయ్య అడిగితే, ఆయనతో పాటు చిరంజీవిని కూడా కలుపుకుని ఒక సినిమా చేసే ఉద్దేశం ఉందని అల్లు అరవింద్ చెప్పారు. అయితే డాన్సులు చిరంజీవికి .. ఫైట్లు తనకి వచ్చేలా చూడమంటూ బాలకృష్ణ తన మనసులోని మాటను బయట పెట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ మాత్రం తనకి ఇవ్వాలని రాఘవేంద్రరావు అన్నారు. ఇలా ఈ వారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ చాలా సరదాగా .. సందడిగా కొనసాగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్