Saturday, January 18, 2025
Homeసినిమామెగా ఫైట్ కోసం రంగం సిద్ధం!

మెగా ఫైట్ కోసం రంగం సిద్ధం!

మెగాస్టార్ కథానాయకుడిగా ‘విశ్వంభర’ రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీవశిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కంటెంట్ ను బట్టి ఈ కథ, భూలోకంలోనే కాకుండా ఇతర లోకాలలోను జరుగుతుంది. అందువలన విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. గ్రాఫిక్స్ కి సంబంధించిన సన్నివేశాలను ముందుగానే చిత్రీకరించారు.

ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ చకచకా జరిగిపోతోంది. తదుపరి షెడ్యూల్ ను జూన్ 2వ వారం నుంచి ప్లాన్ చేశారు. చిరంజీవి .. మరికొందరు ఫైటర్స్ పై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారట. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఫైట్ లో త్రిష కూడా కనిపిస్తుందని అంటున్నారు.

చిరంజీవి – త్రిష గతంలో చేసిన ‘స్టాలిన్’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మళ్లీ వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే. ఇక ఈ మధ్య కాలంలో త్రిష తన గ్లామర్ లుక్స్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది. తిరిగి సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటోంది. ఆ క్రమంలోనే ఈ ప్రాజెక్టులోకి వచ్చింది. మెగాస్టార్ క్రేజ్ కి తగిన కంటెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాను, మ్యూజికల్ హిట్ గా నిలబెట్టడం కోసం కీరవాణి కృషి చేస్తున్నాడు. జనవరి 10వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్