Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప-2' వ‌చ్చేది ఎప్పుడు?

‘పుష్ప-2’ వ‌చ్చేది ఎప్పుడు?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పుష్ప‌ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ‘పుష్ప 2‘ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల పుష్ప 2 మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.

పుష్ప 2 సినిమా షూటింగ్  స్టార్ట్ చేయాల్సిన సమయం దగ్గర పడుతోంది. స్క్రిప్ట్ డిస్షషన్లు, ఫైనల్ చేయడం అన్నవి పక్కన పెడితే అసలు ఎక్కడ షూట్ చేయాలన్న చర్చలు గట్టిగా సాగుతున్నాయి. మళ్లీ అడవుల్లో షూట్ అయితే పక్కాగా వుంది కానీ.. ఏ అడవి అన్నది క‌న్ ఫ‌ర్మ్ కాలేద‌ని టాక్. మళ్లీ మారేడుమిల్లి వెళ్లడమా? మరేదైనా మంచి అటవీ లోకేషన్ చూడడమా? అని ఆలోచిస్తున్నార‌ట మేక‌ర్స్.

హైదరాబాద్ లో కొంత వరకు చిత్రీకరించే అవకాశం వుందని తెలుస్తోంది. రిలీజ్ డేట్ విష‌యానికి వ‌స్తే.. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే 2023 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. కుద‌ర‌క‌పోతే 2024 సమ్మర్ లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి.. పుష్ప 2 ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read: పుష్ప అప్ డేట్ ఇచ్చిన ర‌ష్మిక‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్