బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్రాలు ఎవరికీ కేటాయించని కేటగిరీ నుండి విద్యుత్ ను వాడుకోకుండా మిగులు విద్యుత్ ను అధిక ధరలకు అమ్ముకుంటున్నాయన్న కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర విద్యుత్ శాఖ. బొగ్గు కేటాయింపులు, విద్యుత్ సరాఫరా అంతరాయాల పై రాష్ర్టాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ లేఖ. ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి డిమాండ్ పెరిగింది. కొన్ని రాష్ట్రాలు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడం లేదని, పలు ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్ చేస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది.మరో వైపు అదే రాష్ట్రాలు పవర్ ఎక్సేంజ్ లో అధిక ధరలకు కరెంటు అమ్ముతున్నట్లు సమాచారం ఉంది. ఎవరికీ కేటాయించని కేటగిరీలో వుండే విద్యుత్ ను ఆయా రాష్ట్రాలు వినియోగదారులకు సరఫరా చేసేందుకు ఉపయోగించుకోవాలి. మిగులు విద్యుత్ వివరాలు తెలియజేస్తే, ఆ మిగులును అవసరం వున్న రాష్ట్రాలకు కేటాయిస్తామని లేఖలో కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొన్నది.