Sunday, January 19, 2025
Homeసినిమాదివ్యాన్ష దూకుడు పెంచకపోతే కష్టమే!

దివ్యాన్ష దూకుడు పెంచకపోతే కష్టమే!

Divyansha: తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికలలో దివ్యాన్ష ఒకరు. ‘మజిలీ’ సినిమాతో ఈ బ్యూటీ  తెలుగు తెరపై మెరిసింది. చక్కని కనుముక్కు తీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఈ ఢిల్లీ భామ కుర్రాళ్ల మనసులను  దోచేసింది .. మతులు కాజేసింది. శివ నిర్వాణ ఈ అమ్మాయిని చాలా బాగా చూపించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా కూడా చైతూ – సమంతలకే దక్కింది. ఈ జంటపైనే ప్రేక్షకుల పూర్తి దృష్టి ఉండటంతో, దివ్యాన్ష అందంగా ఉందనుకున్నారుగానీ ఆపై అంతగా పట్టించుకోలేదు.

‘మజిలీ’ సినిమా పబ్లిసిటీ విషయంలో తన ప్రస్తావన అంతగా లేకపోవడమే, తనకి తగిన గుర్తింపు లభించకపోవడానికి కారణమని దివ్యాన్ష భావించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా హిట్ ఆమె ఖాతాలోకి కాస్తయినా తొంగి చూడకపోవడం వల్లనే, అవకాశాలు ఆమెకి అందకుండా దూర దూరంగా తిరిగాయి. మొత్తానికి ఎలాగో అలా ‘రామారావు ఆన్  డ్యూటీ‘లో రవితేజ సరసన నాయికగా అమ్మడికి అవకాశం లభించింది. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో తను పోషించిన పాత్ర పట్ల దివ్యాన్ష గట్టి నమ్మకంతో ఉంది. ఈ సినిమా రిలీజ్ తరువాత తన కెరియర్ గ్రాఫ్  పరిగెత్తడం ఖాయమని భావిస్తోంది. అయితే తెలుగులో ఇప్పటికే కృతి శెట్టి వరుస సినిమాలతో .. హిట్లతో దడదడలాడించేస్తోంది. ఇక ఆమె తరువాత స్థానాల్లో శ్రీలీల .. కేతిక శర్మ దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్ల నుంచి దివ్యాన్ష గట్టిపోటీనే ఎదుర్కోవలసి ఉంటుంది. అందువలన వాళ్లని అందుకోవాలన్నా … అధిగమించాలన్నా ఆమె మరింత కసరత్తు చేయవలసి ఉంటుంది. ఒక రేంజ్ లో దూకుడు చూపించవలసి ఉంటుంది. మరి దివ్యాన్ష ఆ స్థాయి స్పీడ్ చూపిస్తుందేమో చూడాలి.

Also Read : ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్