Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Bhimla DJ Song: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‘. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గత నెల 7 వ తేదీన ఇదే “లాలా భీమ్లా అడవి పులి” గీతం విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం.

మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం. 2021కి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరో మారు అంబరాన్ని తాకేలా చేసింది.

భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారును కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

Also Read : ఫిబ్రవరి 25కు మారిన భీమ్లా నాయక్

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com