NEET రద్దుకు తెలంగాణ మద్దతు కోరిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ . నీట్’ పరీక్ష రద్దు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. DMK ఎంపీ ఎలెన్గోవన్ బృందం ఈ లేఖను బుధవారం తెలంగాణ భవన్ లో TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను కలిసి అందచేసింది. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని NEET పరీక్ష అంశంపై తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఆ బృందం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసన తెలియజేసినట్టు DMK నాయకులు చెప్పారు. తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. కీలకమైన విషయాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదని DMK బృందం నిరసన తెలిపింది.