Friday, April 11, 2025
Homeసినిమాసీతారామం చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోలు.

సీతారామం చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోలు.

సీతారామం.. ఈ చిత్రం క్లాస్ మూవీగా.. ఓ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందింది. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ న‌టించారు. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా ఉంద‌ని టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ… ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ మాత్రం స్పీడుగానే ఉంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని రికార్డు క‌లెక్ష‌న్స్ తో సీతారామం దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.

ఈ దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ లకు మంచి పేరును తెచ్చి పెట్టింది. హీరోగా దుల్కర్ సల్మాన్ కి ఇది కెరీర్ బెస్ట్ మూవీ అనడంలో సందేహం లేదు. ఒక తెలుగు సినిమాకు మలయాళ హీరోను తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది దర్శకుడు హను రాఘవపూడి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. కానీ.. అసలు విషయం ఏంటంటే సీతారామం సినిమా కథను ముందుగా తెలుగు హీరోలకే వినిపించాడట. ముగ్గురు నలుగురు హీరోలకు సీతారామం లైన్ వినిపించారు. కొందరికి పూర్తి కథను కూడా వినిపించారు.

అయితే… హను రాఘవపూడి గత చిత్రాల ప్లాప్ నేపథ్యంలో ఓకే చెప్పలేదట. ఇంత‌కీ సీతారామం క‌థ‌ను విని రిజెక్ట్ చేసిన హీరోలు ఎవ‌రంటే.. నాని, రామ్ అని తెలిసింది. వీరిద్దరిలో నాని కనుక సీతారామం సినిమాను చేసి ఉంటే ప్రాణం పోసినట్లుగా ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాని సహజ నటన సినిమాకు మరింత హైలెట్ అవ్వడంతో పాటు ఆయన కెరీర్ లో నిలిచి పోయే సినిమా అయ్యేది.

Also Read: అంచ‌నాలు పెంచేసిన ‘సీతారామం’ టీజర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్