Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్గురుమూర్తి ప్రమాణం

గురుమూర్తి ప్రమాణం

తిరుపతి లోక్ సభకు ఎన్నికైన డా. ఎం. గురుమూర్తి నేడు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. వెంటనే స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా  కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట గురుమూర్తి (వైఎస్సార్సీపీ) ఆ తరువాత  కర్నాటక-బెలగాం నుంచి శ్రీమతి మంగళ సురేష్ అంగడి (బిజెపి); కేరళ- మలప్పురం నుంచి అబ్డుసమద్ సందాని, (ఐయూఎంఎల్); తమిళనాడు-కన్యాకుమారి నుంచి విజయ్ కుమార్ అలియాస్ విజయ్ వసంత (కాంగ్రెస్) లు సభ్యులుగా ప్రమాణం చేశారు. ఆగస్ట్ 13 వరకూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి గెలుపొందిన బలి దుర్గాప్రసాద రావు (వైఎస్సార్సీపీ) అనారోగ్యంతో సెప్టెంబర్ 16, 2020న మరణించారు. 2021 ఏప్రిల్ లో జరిగిన ఉపఎన్నికల్లో గురుమూర్తి 2,71,592 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular