Dr Tamilisai Trubutes:
ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన సిడిఎస్ చీఫ్ బిపిన్ రావత్ పార్దీవ దేహానికి తెలంగాణా గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న తమిళి సై సౌందర రాజన్ నివాళులర్పించారు. నిన్న కూనూరు అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో బిపిన్, మధులిత రావత్ దంపతులతో పాటు మరో 9 మంది సైనిక సిబ్బంది మరణించారు. వీరి భౌతిక కాయాలను వెల్లింగ్టన్ సైనిక ఆస్పత్రి నుంచి నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంట్ కు తరలించారు. అక్కడ రావత్ దంపతులతో పాటు మిగిలిన వారి బౌతిక కాయాలపై పూల మాల వేసి తమిళి సై నివాళులర్పించారు. అనంతరం వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.
Also Read : బిపిన్ రావత్ నిజమైన దేశభక్తుడు: మోదీ