Thursday, March 12, 2026
HomeTrending Newsడ్రగ్ ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.

డ్రగ్ ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.

హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. తాజాగా రాచకొండలో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన మల్కాజ్గిరి పోలీసులు.. నిందితుల నుంచి 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ దాదాపు రూ. 9 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్నారని పోలీసులు చెప్పినట్లు ప్రాథమిక సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

శనివారం కూడా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సిబ్బందితో కలిసి మంగళ్‌హాట్ పోలీసులు.. ముగ్గురు గంజాయి వ్యాపారులను, ఒక గంజాయి రవాణాదారుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72 కేజీల గంజాయి, 1.8 కేజీల గంజాయి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధాన ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లోని ధూల్‌పేట్ ఆకాష్ సింగ్‌గా గుర్తించారు. 2018 నుంచి అతను ఖమ్మంకు చెందిన షేక్ సుభానీ నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌లో పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇక, షేక్ సుభానీ ఒడిశా రాష్ట్రంలోని పాపులూరులో గంజాయిని పండించే వల్సగడ్డ మహేష్ నుంచి పెద్దమొత్తంలో గంజాయిని సేకరించి.. హైదరాబాద్‌లో ప్రధాన వ్యాపారి అయిన ఆకాష్ సింగ్‌కు రవాణా చేస్తున్నాడు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular