‘లైగర్’ టీజర్ వాయిదా

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీని పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా లైగర్ మూవీ టీజర్ రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ.. లైగర్ టీజర్ రిలీజ్ కాలేదు. దీనిపై లైగర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ.. లైగర్ టీమ్ ఏం చెప్పిందంటే.. ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితుల్లో లైగర్ టీజర్ విడుదల చేయడం కరెక్ట్ కాదు.

అందుకే ఆ పవర్ ప్యాకెడ్ టీజర్ ను వాయిదా వేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక లైగర్ టీజర్ విడుదల చేస్తాం. ఖచ్చితంగా ఆ టీజర్ లో విజయ్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించడం ఖాయం అని మేకర్స్ తెలియచేశారు. అలాగే.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. వాక్సిన్ వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని విజయ్ మరియు నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ వారు ఆకాంక్షించారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

ఇక లైగర్ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. ఈ మూవీ కీలక షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. కరోనా తగ్గిన తర్వాత తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ లో ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *