భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిడదవోలు పర్యటన 30వ తేదీకి వాయిదా పడినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఓ ప్రకటనలో తెలిపారు. 22 న నిడుదవోలు లో పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ కింద ఆర్ధిక సాయాన్ని లబ్దిదారుల అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో ఏర్పాట్లకు ఆటంకం కలుగుతున్నందున నెలాఖరుకు వాయిదా వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా 15వేల రూపాయల చొప్పున ఐదేళ్ళలో 75వేలు ఆర్ధికంగా చేయూత అందించేందుకు వైఎస్సార్ కాపు నేస్తం పథథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే మూడేళ్ళు ఈ కార్యక్రమం కింద రూ. 1,491.93 కోట్లు అందించింది. నాలుగో ఏడాది కార్యక్రమాన్ని ౩౦న నిడుదవోలులో అందించనున్నారు.