Sunday, January 19, 2025
HomeTrending Newsసంక్షోభంలో ఉత్తర బెంగాల్ బ్లడ్ బ్యాంకులు

సంక్షోభంలో ఉత్తర బెంగాల్ బ్లడ్ బ్యాంకులు

పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు లేక ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయలేని దుర్బర పరిస్టితులు ఏర్పడ్డాయి. దాతలు ముందుకు రాకపోవటంతో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోయాయి. రక్త దాన శిబిరాలు నిర్వహించినా కరోన కు భయపడి దాతల నుంచి స్పందన కరువైందని ఆరోగ్య శాఖ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో  శస్త్ర చికిత్సల సమయంలో రక్తం అందక రోగులు ప్రాణ అపాయ  స్థితికి చేరుకుంటున్నారు.

గతంలో దాతల ద్వారా 800 యూనిట్ల రక్తం నిల్వలు ప్రతి నెల సమకూరెవని, ఇప్పుడు కేవలం మూడు వందల యూనిట్లు మాత్రమె లభిస్తున్నాయని సిలిగురి ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో విపత్కర పరిస్థితులు వచ్చినపుడు జూనియర్ డాక్టర్లు రక్త దానం చేసి రోగులను ఆదుకుంటున్నారు. డబ్బులు వెచ్చించి కొనలేనివారి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోపోతే రాబోయే రోజుల్లో ఉత్తర బెంగాల్లో వైద్య రంగం సంక్షోభం ఎదుర్కోనుంది.

పశ్చిమ బెంగాల్లో కొలకత్తా, ఖరగ్ పూర్  తర్వాత పెద్ద నగరం సిలిగురి. ఉత్తర బెంగాల్లో కీలక ప్రదేశంలో ఉన్న సిలిగురికి విద్య,వైద్య, వ్యాపారాల నిమిత్తం ఈశాన్య రాష్టాలు, సిక్కిం తో పాటు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ నుంచి అనేక వర్గాలు రాక పోకలు సాగిస్తుంటాయి. చికెన్ నెక్ గా పెలిచే ఈ ప్రాంతం రక్షణ పరంగా కీలకమైనది. ఈ నేపథ్యంలో భారత రక్షణ శాఖ వ్యూహాత్మకంగా సిలిగురి నగరం నలువైపులా మిలిటరీ విభాగాల్ని ఏర్పాటు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్