Friday, March 29, 2024
Homeసినిమాదుల్కర్ సల్మాన్  చిత్రానికి  ‘సీతా రామం’ టైటిల్ ఖరారు

దుల్కర్ సల్మాన్  చిత్రానికి  ‘సీతా రామం’ టైటిల్ ఖరారు

Seetaa Ramam:  వెండితెరపై మర్చిపోలేని ప్రేమకథలు తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా యుద్ధం నేపధ్యంలో అందమైన ప్రేమకథ చిత్రం రూపొందుతుంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి ‘సీతా రామం” అనే టైటిల్ ని ఖారారు చేశారు. ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పంచుకున్న టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ‘ఇది ఓ సైనికుడు శత్రుకి అప్పగించిన యుద్దం ఆఫ్రీన్. ఈ యుద్ధంలో సీతారాములని నువ్వే గెలిపించాలి’ అనే డైలాగ్ టైటిల్ తగ్గట్టు అద్భుతంగా వుంది. ఈ డైలాగ్ తర్వాత ఆఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న రివిల్ కావడం, తర్వాత సీత పాత్రలో హీరోయిన్ మృణాళిని, రాముడి పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించడం ఆసక్తికరంగా వుంది.

యుద్ధం నేపధ్యంలో సాగే ఈ ప్రేమ కథలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. టైటిల్ వీడియోలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా విజువల్ ట్రీట్ గా వుండబోతుందని అర్ధమౌతుంది. వెటరన్ సినిమాటోగ్రఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో వున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్