ఈ-కామర్స్ రంగం సమగ్ర శాసన పరిధిలో నిర్వహించడం జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. దేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి ఎటువంటి చట్టం లేదనేది నిజమేనా? అదే నిజమైతే దానికి గల కారణాలను తెలపాలని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్ రామ్ లోక్ సభ లో అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు.
ఇ-కామర్స్ రంగానికి వర్తించే కొన్ని చట్టాలలో వినియోగదారుల రక్షణ చట్టం, (2019), పోటీ చట్టం (2002), కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను (సీజీఎస్టీ) చట్టం (2017), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (2000), చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల చట్టం (2007), కంపెనీల చట్టం (2013), కాపీరైట్ చట్టం (1957) వంటి చట్టాలు, ఎఫ్‌డీఐ పాలసీ మరియు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (1999)
ఇ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ)కి సంబంధించిన నిబంధనలను కలిగి ఉన్నాయని మంత్రి సోం ప్రకాష్ వివరించారు. ఫుడ్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌లు పోటీ నిబంధనలకు వెలుపల పడిపోతున్నాయన్న విషయం కూడా నిజమేనా, అందువల్ల మార్కెట్ రెగ్యులేటర్‌లు వాటిని సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాయా…అలా అయితే వాటి వివరాలు కూడా తెలియ జేయాలని ఎంపీ భరత్ మంత్రిని కోరారు. దానిపై మంత్రి సోం ప్రకాష్ సమాధానమిస్తూ సెక్షన్ 3 (పోటీ ఒప్పందాల నిరోధకం), సెక్షన్ 4 (ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం) మరియు సెక్షన్ 5, సెక్షన్ 6 (విలీనాలు మరియు సముపార్జనలు)లో అందించిన విధంగా కాంపిటీషన్ యాక్ట్, 2002 యొక్క నిబంధనలు రెస్ప్ ఫుడ్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌లలో వర్తిస్తాయని తెలిపారు. మంత్రిత్వ శాఖ ఐరోపా డిజిటల్ మార్కెట్ల చట్టాన్ని అధ్యయనం చేసిందా.. అలా అయితే ఆ చట్టం ముఖ్య వివరాలు తెలపాలన్న ఎంపీ భరత్ మరో ప్రశ్నకు మంత్రి సోం ప్రకాష్ వివరణ ఇచ్చారు. డిజిటల్ మార్కెట్ల చట్టం (డీఎంఏ)పై నిర్దిష్ట అధ్యయనం చేపట్టలేదని పేర్కొన్నారు.
అయితే యూరోపియన్ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డిజిటల్ మార్కెట్స్ చట్టం డిజిటల్ రంగంలో “గేట్‌ కీపర్‌లు”గా పనిచేసే ప్లాట్‌ఫారమ్‌ల కోసం నియమాలను పరిచయం చేస్తుందని మంత్రి తెలిపారు.
ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను, మరీ ముఖ్యంగా ఆహార సేవా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి భారతీయ షరతులను సవరించడం ద్వారా మంత్రిత్వ శాఖ అటువంటి చట్టాన్ని ఆమోదించగలదా?, అలా అయితే దాని వివరాలు తెలపాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. దానికి కేంద్ర సహాయ మంత్రి సోం ప్రకాష్ సమాధానమిస్తూ ప్రమాణాల ప్రకారం “గేట్ కీపర్స్”గా నియమించబడే కంపెనీలకు మాత్రమే చట్టం వర్తిస్తుందని, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసులను పరిగణనలోకి తీసుకోవడంతో సహా విస్తృత వాటాదారుల సంప్రదింపుల తర్వాత మాత్రమే అన్ని చట్టాలు రూపొందించారని మంత్రి సోం ప్రకాష్ ఎంపీ భరత్ కు వివరించారు.

Also Read : శాసన పరిధిలోనే ‘ఈ-కామర్స్’ రంగం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *