Wednesday, March 11, 2026
HomeTrending Newsఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

Earthquake In Indonesia : ఇండోనేషియాలో ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతగా నమోదయినట్టు అమెరికా జియలజికల్ సర్వే  తెలిపింది. తీవ్రమైన భూకంపం కారణంగా సునామి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు నుసా టెంగ్‌గెరా ప్రావిన్సుల్లో ఫ్లోరేస్ దీవికి ఉత్తరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం భీభత్సం సృష్టించింది.

భూకంపం వల్ల ఆస్తి, ప్రాణనష్టం గురించి తక్షణమే ఎటువంటి సమాచారం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఇప్పటికీ సురక్షితంగా ఉందని, ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. ఫ్లోరెస్‌లో సముద్రానికి 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మౌమెరే పట్టణానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 1,000 కిలోమీటర్ల పరిధిలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని ముందుగా హెచ్చరించిన తర్వాత భూకంపం వల్ల ఇకపై సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

జపాన్ నుంచి ఆగ్నేయాసియా.. పసిఫిక్ బేసిన్ మీదుగా విస్తరించి ఉన్న భూకంపానికి కారణమయ్యే టెక్టోనిక్ ప్లేట్స్‌ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ స్థానంలో ఇండోనేషియా ఉండటంతో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. 2004 డిసెంబరు 26 ఇండోనేషియాలో 9.1 తీవ్రత భారీ భూకంపం సంభవించి సునామీకి దారితీసింది. ఈ సునామీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ఇండోనేషియాలోనే 1.70 లక్షల మంది చనిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular