8.8 C
New York
Sunday, December 10, 2023

Buy now

HomeTrending Newsజమ్ముకశ్మీర్‌లో భూకంపం

జమ్ముకశ్మీర్‌లో భూకంపం

జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు.

గత 10 రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. జనవరి 1న 3.8 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో కశ్మీర్‌లో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ నెల 5న అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూమిలో కదలికలు వచ్చాయి. దీంతో జమ్ముకశ్మీర్‌తోపాటు, ఢిల్లీలో కూడా భూకంపం వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్