Tuesday, May 6, 2025
HomeTrending Newsఎమ్మెల్సీ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్సీ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాల ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ లు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనిపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ ను విచారించిన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారిద్దరిపై అనర్హత వేటు  వేశారు. ఈ సీట్లకు ఈసీ ఉపఎన్నిక షెడ్యూల్ నేడు విడుదల చేసింది.

  • నోటిఫికేషన్ – జూన్ 25, 2024
  • నామినేషన్ లకు చివరి తేదీ: 02 జూలై;  స్క్రూటినీ – 3 జూలై
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 05 జూలై
  • పోలింగ్ తేదీ: 12 జూలై , అదేరోజు ఫలితాలు

ఈ రెండు స్థానాలకూ పదవీకాలం 29 మార్చి, 2027 వరకూ ఉంది.

ఎమ్మెల్యే కోటాలో మరో సీటు కూడా ఖాళీగా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన జంగా కృష్ణ మూర్తి వైసీపీ వీడడంతో ఆయనపై గతనెల (మే 16న) సస్పెన్షన్ వేటు పడింది.  అయితే  ఈ అనర్హత సరైన సమయానికి ఈసీ వద్దకు చేరకపోవడంతో ఆ స్థానానికి షెడ్యూల్ విడుదల చేయలేదు.

ఈ మూడింటితో పాటు స్థానిక సంస్థల కోటాలో మరో రెండు,  టీచర్స్ కోటాలో మరో స్థానం కలిపి మొత్తం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

వైసీపీ నుంచి ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్ (విశాఖ) జనసేనలో చేరారు. ఆయన విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు (విజయనగరం) కూడా ఇటీవలి ఎన్నికల్లో బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు. వీరిపై కూడా మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. వీటితో పాటు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన షేక్ బాబ్జీ 2023 డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెదడంతో ఆ సీటు కూడా ఖాళీ అయ్యింది.

ప్రస్తుతం రెండు సీట్లకు మాత్రమే ఈసీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్