Sunday, January 19, 2025
HomeTrending Newsశ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీన‌గ‌ర్ సమీపంలో ఈ రోజు తెల్లవారు జామున ఉగ్ర‌వాదులు..భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే నిర్ధిష్టమైన సమాచారంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. వారిని అన్సార్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ సంస్థకు చెందిన అజీజ్‌ రసీ నాజర్‌, షాహిద్‌ అహ్మద్‌గా గుర్తించామన్నారు. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్‌, రెండు పిస్తోల్‌లు, ఆయుధ సమాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పుల్వామాలో ఈ నెల 2న పశ్చిమబెంగాల్‌కు చెందిన మునీర్‌ ఇస్లామ్‌ అనే కార్మికుడిపై జరిగిన ఉగ్రదాడిలో వీరిద్దరి హస్తముందని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

జమ్ము కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా దేశ సరిహద్దుల్లో పర్యటిస్తుండగానే ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించటం గమనార్హం. దేశ సరిహద్దుల్లో పరిస్థితి సమీక్షించేందుకు రెండు రోజుల పర్యటనకు పూంచ్ జిల్లాకు గవర్నర్ ఈ రోజు చేరుకున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గ్రామాలను సందర్శించి గవర్నర్ స్వయంగా గ్రామస్తులు, స్థానికులతో మాట్లాడుతున్నారు. ఈ రోజు పూంచ్ జిల్లాలోని దేగ్వార్ తెర్వాన్ ప్రాంతంలో గవర్నర్ పర్యటిస్తున్నారు.

Also Read : సోపియాన్ జిల్లాలో కాశ్మీర్ పండిట్ హత్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్