Saturday, April 20, 2024
HomeTrending Newsషిండే -రాజ్ థాకరే చర్చలపై జోరుగా ఉహాగానాలు

షిండే -రాజ్ థాకరే చర్చలపై జోరుగా ఉహాగానాలు

మహారాష్ట్ర పొలిటికల్‌ గేమ్‌లోకి కమలం పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి షిండే వర్గానికి నడిపిస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫడ్నవీష్ రంగంలోకి దిగారు. ముంబైలో ఈ రోజు అత్యవసరంగా బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమకు 172 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. పార్టీ ఎమ్మెల్యేలంతా ముంబైలోనే ఉండాలని ఆదేశించింది. రాష్ట్ర నేతలతో సమావేశం పూర్తి కాగానే దేవేంద్ర ఫద్నవిస్ ఢిల్లీకి పయనమయ్యారు. మరోవైపు శివసేన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా షిండే వర్గం భావిస్తోంది. రెండు రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మరోవైపు ఇన్నాళ్లూ శివసేన వర్సెస్ ఏక్‌నాథ్‌ షిండేగా సాగిన మహా హైడ్రామాలో.. ఇపుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌థాక్రే ఎంట్రీ ఇచ్చారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. మాజీమంత్రులు నితిన్ సర్దేశాయ్, బాలానందతో రాజ్‌థాక్రే భేటీ అయ్యారు. శివసేన సర్కారుపై తిరుగుబాటు చేసిన రెబల్ వర్గం నేత ఏక్‌నాథ్ షిండేతో ఆయన ఫోన్‌లో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలు ఎంఎన్ఎస్‌లో కలిసే అంశంపై రాజ్‌థాక్రే-షిండేల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే, రాజ్‌థాక్రే మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. దీంతో ఇపుడు మహారాష్ట్ర రాజకీయ, పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. బాల్‌థాక్రే తమ్ముని కొడుకు అయిన రాజ్‌థాక్రే.. సీఎం ఉద్దవ్‌ థాక్రేకు సోదరుడు అవుతాడు. నాడు శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్‌థాక్రే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించాడు. ఇపుడు గతాన్ని మరిచి సంక్షోభంలో సోదరులకు అండగా నిలిచి సంధి చేస్తాడా? లేక షిండే వర్గం, బీజేపీతో కలిసి శివసేనను గద్దె దింపి ప్రతీకారం తీర్చుకుంటాడా? అనేది చర్చనీయాంశమైంది.

Also Read : బాలా సాహెబ్ శివసేన..పేరుతో షిండే కొత్త పార్టీ     

RELATED ARTICLES

Most Popular

న్యూస్