Thursday, November 21, 2024
HomeTrending Newsపల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు: ఈసీ నిర్ణయం

పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు: ఈసీ నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ రోజుతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లను సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.  వీరిద్దరితో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీవేటు వేసింది. మరో 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారులపై కూడా ఈసీ చర్యలు తీసుకుంది.

ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలపై సీరియస్ అయిన ఈసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు సామాన్లు జారీ చేసి నేటి మధ్యాహ్నం మూడున్నర గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈసి అధికారులతో నేటు భేటీ అయిన సిఎస్, డిజిపిలు కేంద్ర ఎన్నికల అధికారులను కలుసుకుని రాష్ట్రంలోని ఘటనలపై వివరణ ఇస్తూ ఆరు అంశాలతో కూడిన ప్రతిపాదనలు ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేమి కారణంగానే ఈ మూడు జిల్లాల్లో హింసలు చోటు చేసుకుందని వారు వివరణ ఇచ్చారు. వీటి ఆధారంగా చర్యలు తీసుకున్న ఈసీ మొత్తం ఘటనలపై ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు ఎన్నికల ఫలితాల తర్వాత మరో 15 రోజులపాటు 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట్రంలోనే కొనసాగేలా కేంద్ర హోం శాఖకు ఈసీ సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్