Saturday, November 23, 2024
HomeTrending Newsశ్రీలంకలో ఎమర్జెన్సీ

శ్రీలంకలో ఎమర్జెన్సీ

శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో పేదరికం విలయతాండవం చేస్తోంది. దోపిడీలు, లూటీలు నిత్య కృత్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో  ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అధ్యక్షుడు రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంచలన నిర్ణయం తీసుకోవటంతో ప్రజల్లో మరింత నిరసన భావం పెల్లుబుకుతోంది. అత్యవసర పరిస్థితి ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు.

శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ‍శ్రీలంక ప్రజలు.. ఆ దేశ అధ్యక్షుడి ఇంటి ముందు చేప‌ట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో కొలంబోలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.

Also Read : శ్రీలంకలో దుర్భర పరిస్థితులు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్