Saturday, January 18, 2025
HomeTrending Newsదుబాయ్ లో 30 కోట్లు గెలుచుకున్న తెలంగాణ యువకుడు

దుబాయ్ లో 30 కోట్లు గెలుచుకున్న తెలంగాణ యువకుడు

దుబాయ్ లో తెలంగాణ యువకుడిని అదృష్టం వరించింది. ఎమిరేట్స్ డ్రాలో లాటరి తగలటంతో ఆ యువకుడి దశ తిరిగింది. ఉన్న ఊరిలో ఉపాధి లేక దుబాయ్ వెళ్ళిన ఆ యువకుడి జీవితం మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాత్రికి రాత్రి 30 కోట్లకు యజమానిని చేసింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన ఓగుల దేవరాజం- ప్రమీల ల కుమారుడు అజయ్ బతుకుదెరువు కోసం ఇటీవల దుబాయ్ కి వలస వెళ్ళాడు. అక్కడ డ్రైవర్ గా విధుల్లో చేరాడు. దుబాయ్ లో అక్కడి 15 ధీరమ్స్ డబ్బులతో ఎమిరేట్స్ డ్రాలో పెట్టుబడి పెట్టి నంబర్ తీసుకున్నాడు. డ్రాలో అదృష్టం తననే వరించిందన్న విషయం తెలుసుకున్న అజయ్ స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అజయ్ కి 30 కోట్లు డ్రా గెలుచుకోవడం పట్ల అతని బంధువులు, మిత్రులు, గ్రామస్థులు సంతోషం వెలిబుచ్చారు.

గతంలో కూడా జిల్లా వాసులకు దుబాయ్ డ్రాలో అదృష్టం వరించింది. మెట్పల్లి మాజీ జడ్ పి టి సి ఆకుల లింగారెడ్డికి ఇదే స్థాయిలో లాటరీ తగిలింది. బతుకు తెరువు కోసం తెలంగాణ జిల్లాల నుంచి వెళ్ళే యువత… దుబాయ్ లో లాటరీలో కొనటం సహజం. అయితే ఇది వరకు లాటరీ వరించిన వారితో టికెట్స్ కొనుగోలు చేయిస్తారు. వాటి రేటు కూడా ఎక్కువ ఉండటంతో నలుగురు, అయిదుగురు కలిసి వీటిని కొనుగోలు చేస్తారు. ఎక్కువగా వచ్చేటపుడు లేదా దుబాయ్ నుంచి వెళ్ళేటపుడు విమానాశ్రయంలో లాటరీ టికెట్లు కొనటం ఆనవాయితీగా వస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్