Tuesday, March 25, 2025
HomeTrending Newsమంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ

మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ

talks started: పే రివిజన్ కమిషన్ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలు మంత్రుల కమిటీతో సమావేశం అయ్యారు. సచివాలయం రెండో బ్లాక్ లో ఆర్ధిక శాఖ సమావేశ మందిరంలో ఈ చర్చలు మొదలయ్యాయి.  మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ బారిన పడిన కారణంగా రాష్ట్ర రవాణా, ఐ అండ్ పి ఆర్ శాఖ మంత్రి పేర్ని నాని సమావేశానికి హాజరు కాలేకపోయారు.

ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని పట్టుబట్టిన నేతలు నిన్న ఓ మెట్టు దిగివచ్చి ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వస్తామని సమాచారం పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ లో ఉన్న 20మంది నేతలు చర్చలకు రావాలని వారి పేర్లను కూడా ప్రస్తావిస్తూ అధికారికంగా లేఖ పంపింది. సాధారణ పరిపాలనా శాఖా ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ లేఖ పంపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్