Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్బాక్సింగ్ డే టెస్ట్: బౌలింగ్ లో రాణించినా....

బాక్సింగ్ డే టెస్ట్: బౌలింగ్ లో రాణించినా….

Boxing Day Test: యాషెష్ సిరీస్ లో బాక్సింగ్ డే టెస్టులో కూడా ఆస్ట్రేలియా గెలుపు బాటలో పయనిస్తోంది. ఇంగ్లాండ్ బౌలర్లు రాణించి ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 267 పరుగులకే కట్టడి చేసినా, బ్యాట్స్ మెన్ మరోసారి దారుణంగా విఫలం కావడంతో కష్టాల్లో పడింది, రెండో ఇన్నింగ్స్ లో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.

తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 60 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు రెండోరోజు ఆట మొదలు పెట్టిన ఆసీస్ ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మార్కస్ హారిస్ ఒక్కడే 76 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్(27); కెప్టెన్ కమ్మిన్స్ (21) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ నాలుగు; రాబిన్సన్, మార్క్ వుడ్ చెరో రెండు; స్టోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 82 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

రెండో రోజే తుది ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు 7పరుగుల వద్ద ఓపెనర్ జాక్ క్రాలే(5)…స్టార్క్ బౌలింగ్ లో అలెక్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్టార్క్ వేసిన తర్వాతి బంతికే వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలాన్ బౌల్డ్ అయి డకౌట్ గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 22 పరుగుల వద్ద మరో బౌలర్ బొలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు… ఓపెనర్ హసీబ్ హమీద్(7), జాక్ లీచ్(0) లను ఔట్ చేసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ రూట్-12; బెన్ స్టోక్స్-2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Also Read : బాక్సింగ్ డే టెస్ట్: తొలిరోజు ఆసీస్ దే

RELATED ARTICLES

Most Popular

న్యూస్