Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్తొలి వన్డేలో ఇంగ్లాండ్ మహిళల విజయం

తొలి వన్డేలో ఇంగ్లాండ్ మహిళల విజయం

ఇండియా – ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన క్రికెట్ మొదటి వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది.

ఇండియా జట్టులో కెప్టెన్ మిథాలీ రాజ్ 108 బంతుల్లో 72 పరుగులు చేసింది. పూనం రౌత్ 32, దీప్తి శర్మ 30 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 40 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టారు.

202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ సిన్ 87 బంతుల్ల్లో 12ఫోర్లు, ఒక సిక్సర్ తో 87పరుగులు సాధింఛి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు వన్డేల సిరీస్ లో ఇంగ్లాండ్ ¬1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే జూన్ 30న బుధవారం జరగనుంది.

ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. జూన్ 16 నుంచి బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్ లోనే జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ నేడు జరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్