Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ ముందు భారీ విజయ లక్ష్యం

ఇంగ్లాండ్ ముందు భారీ విజయ లక్ష్యం

Tough time for England:  యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ ముందు 468 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 82  పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కనీసం డ్రా కోసం అయినా ప్రయత్నించాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.

రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 45 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 230 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి ఆటను డిక్లేర్ చేసింది.  ఆసీస్ జట్టులో లాబుస్ చేంజ్, ట్రావిస్ హెడ్ చెరో 51 పరుగులు చేసి ఔటయ్యారు. గ్రీన్-33, మార్కర్ హారిస్-23 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్, రూట్, మలాన్ చెరో రెండు; అండర్సన్, బ్రాడ్ చెరో వికెట్ పడగొట్టారు.

భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు స్కోరు 4 వద్ద ఓపెనర్ హసీబ్ హమీద్ డకౌట్ అయ్యాడు. 48 వద్ద డేవిడ్ మలాన్ (20), 70 వద్ద రోరీ బర్న్స్(34) ; 82 వద్ద కెప్టెన్ రూట్ (24) ఔటయ్యారు. నాలుగో వికెట్ పడగానే నేటి ఆటను ముగించారు. బెన్ స్టోక్స్  పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ రెండు, స్టార్క్, నేసర్ చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్