Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Root & Bairstow: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపు

Root & Bairstow: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపు

ఎడ్జ్ బాస్టన్ టెస్టులో ఇండియాపై ఇంగ్లాండ్ ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జో రూట్, జానీ బెయిర్ స్టో సెంచరీలతో కదం తొక్కారు.  ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో  డ్రాగా ముగిసింది.  ఇండియా రెండో ఇన్నింగ్స్ తరువాత ఆతిథ్య ఇంగ్లాండ్ ముందు 378 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఇంగ్లాండ్ నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 259 పరుగులు చేసింది. విజయానికి నేడు చివరి రోజు 119పరుగులు అవసరం కాగా, రూట్-142, బెయిర్ స్టో-114 పరుగులతో అజేయంగా నిలిచి అద్భుత విజయం అందించారు.

భారత జట్టు గత ఏడాది ఆగస్టులో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్ళింది. నాటింగ్ హామ్ లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగియగా, లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇండియా విజయం సాధించింది. లీడ్స్ లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందింది. కెన్నింగ్ టన్ లో జరిగిన నాలుగో టెస్టులో ఇండియా గెలిచి సిరీస్ లో 2-1ఆధిక్యం సంపాదించింది. సెప్టెంబర్ 10నుంచి 14 వరకూ మాంచెస్టర్ లో జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ కోవిడ్ కారణంగా రద్దయింది. ఐసిసి నిబంధనల ప్రకారం రెండేళ్ళ పాటు జరిగే  టెస్ట్ ఛాంపియన్ షిప్ కాలంలో ఈ మ్యాచ్ ను మళ్ళీ రీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. దీనితో జూలై 1నుంచి 5వరకూ ఈ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేయాలని బిసిసిఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.

ఈ ఐదో టెస్టు మ్యాచ్ ను కనీసం డ్రా గా అయినా ముగించి సిరీస్ గెల్చుకోవాలన్న ఇండియా ఆశలు ఫలించలేదు.

కు జానీ బెయిర్ స్టో కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’  జో రూట్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించింది.

తాజా షెడ్యూల్ లో భాగంగా ఇండియా జట్టు ఇంగ్లాండ్ తో మూడు టి20,మూడు వన్డే మ్యాచ్ లు కూడా ఆడనుంది. తొలి టి 20 ఎల్లుండి జూలై 7న సౌతాంప్టన్ లో జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్