Monday, June 15, 2026
Homeజాతీయంచంద్ర శేఖర్ గురూజీ దారుణ హత్య

చంద్ర శేఖర్ గురూజీ దారుణ హత్య

Murder: కర్నాటక రాష్ట్రానికి చెందిన వాస్తు సిద్ధాంతి డా. చంద్ర శేఖర్ గురూజీ హుబ్లీలో దారుణ హత్యకు గురయ్యారు. ఓ ప్రైవేట్ హోటల్ లో బస చేసిన ఆయనను శిష్యులుగా చెప్పుకొని అక్కడకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. తాము వారి శిష్యులమని చెప్పి హోటల్ లో ప్రవేశించిన వారు హోటల్  రిసెప్షన్ లో కూర్చుని వున్న గురూజీ వద్దకు వచ్చి అయన కాళ్ళకు నమస్కారం చేసే నెపంతో దగ్గరకు వెళ్లి, జేబులో నుంచి కత్తులు తీసి నిర్దాక్షిణ్యంగా పొడిచారు. శరీరంలో అనేక కత్తిపోట్లకు గురైన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకం జరిగింది.

చంద్రశేఖర్ కు వాస్తు శాస్త్రంలో మంచి నైపుణ్యం ఉంది, సిద్ధాంతిగా మంచి పేరు సంపాదించారు. సరళ వాస్తు పేరుతో కొన్ని వందల ఉపనాస్యాలు ఇచ్చిన అయన వేలాది సెమినార్లలో పాల్గొన్నారు. అయన దారుణ హత్య సంచలనం కలిగించింది. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బంధువుల ఇంట్లో జరుగుతోన్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రశేఖర్ గురూజీ హుబ్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. నేడు ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను బాగల్ కోట్ కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular