పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ను ఆతిథ్య ఇంగ్లాండ్ గెల్చుకుంది. ముల్తాన్ నేషనల్ స్టేడియంలో నేడు ముగిసిన రెండో టెస్ట్ లో 26 పరుగులతో విజయం సాధించిన ఇంగ్లాండ్, వరుసగా రెండు టెస్టులు గెల్చుకొని మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది.
355 పరుగుల లక్ష్యంతో నిన్న నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ మొదలు పెటిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. చివరి రోజు 157 పరుగులు అవసరం కాగా ఇంగ్లాండ్ బౌలింగ్ దెబ్బకు లక్ష్యం సాధించడంలో చతికిలపడింది.
జట్టులో షాద్ షకీల్-94; ఇమామ్ ఉల్ హక్-60; అబ్దుల్లా షఫీక్-45; మొహమ్మద్ నవాజ్-45 పరుగులతో రాణించారు. నవాజ్, షకీల్ ఔటైన తర్వాత కీలక భాగస్వామ్యం నమోదు చేయడంలో పాక్ విఫలమైంది.
ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4; ఓలీ రాబిన్సన్, అండర్సన్ చెరో రెండు; జాక్ లీచ్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ టెస్ట్ లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్స్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
మూడో టెస్ట్ డిసెంబర్ 17 న కరాచీ నేషనల్ స్టేడియం లో మొదలు కానుంది.