Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్నాలుగో టెస్ట్: ఉమేష్, శార్దూల్ లకు చోటు

నాలుగో టెస్ట్: ఉమేష్, శార్దూల్ లకు చోటు

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా జట్టు రెండు మార్పులు చేసింది. ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ లకు చోటు దక్కింది. ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ స్థానంలో వీరిద్దరినీ తీసుకున్నారు.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఇంగ్లాండ్ జట్ట్లులో కూడా రెండు మాపులు చోటు చేసుకున్నాయి. జోస్ బట్లర్, శాం కరన్ స్థానంలో ఆలీ పోప్స్, క్రిస్ ఓక్స్ లను జట్టులోకి తీసుకున్నారు. లండన్ లోని కెన్నింగ్ టన్ స్టేడియం లో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ఐదు టెస్టుల సిరీస్ లో మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది, రెండో టెస్ట్ ఇండియా, మూడో టెస్ట్ ఇంగ్లాండ్  గెల్చుకున్నాయి, ప్రస్తుతం 1-1తో సిరీస్ సమం అయ్యింది. మూడో టెస్టులో ఎదురైనా ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలని  ఇండియా ఆరాటపడుతుండగా, ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ పై పట్టుబిగించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular