Friday, June 12, 2026
Homeసినిమా'ERROR 500' ట్రైలర్ రిలీజ్

‘ERROR 500’ ట్రైలర్ రిలీజ్

మైత్రేయ మోషన్ పిక్చర్స్ పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ERROR500’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది. దర్శకుడు వి. ఎన్ ఆదిత్య , హీరో ఆకాష్ పూరితో పాటు బిగ్‌బాస్ రవి, సోహెల్, సిరి, కాజల్, నేహా చౌదరి, అర్జున్ కళ్యాణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

వి. ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘ERROR500’ జెస్సికి యాప్ట్ టైటిల్. ఒకేసారి మల్టిపుల్ పనులు చేయగలడు. నేను రెగ్యులర్ గా బిగ్ బాస్ షో చూస్తాను. అందులో నాకు నచ్చినవారంతా ఈ వేడుకలో వుండటం ఆనందంగా వుంది. ఈ స్టేజ్ పైకి వస్తుంటే సడన్ గా ఆదిత్య 369 గుర్తుకు వస్తోంది. కాలానికి వెనక్కి వెళ్లి బిగ్ బాస్ సీజన్ 5, ముందుకు వెళ్లి టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ని చూస్తున్నట్లు అనిపించింది. ‘ERROR500’ ట్రైలర్ బ్రిలియంట్ గా వుంది. జెస్సి, సాందీప్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.

జెస్సీ మాట్లాడుతూ…’ERROR500′ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. మా నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. వారి నమ్మకాన్ని నిర్మబెట్టుకుంటాం. దర్శకుడు సాందీప్ యూనిక్ కథతో రూపొందించారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫణి కళ్యాణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు.

Also Read : ‘ERROR500” టీజర్ ని రిలీజ్ చేసిన మంత్రి తలసాని 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular