Wednesday, June 17, 2026
HomeసినిమాNTR: 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

NTR: ‘వార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి అప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటి వరకు చేయని పవర్ ఫుల్ రోల్ లో ఎన్టీఆర్  కనిపించనున్నారని టాక్. మరో విషయం ఏంటంటే.. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారని.. రెండు క్యారెక్టర్లు వైవిధ్యంగా ఉంటూ ఒకదానితో ఒకటి పోటీపడేలా ఉంటాయని సమాచారం. షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గ్యాప్ లేకుండా శరవేగంగా వర్క్ జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ‘వార్ 2’ అనౌన్స్ మెంట్ వచ్చింది. వార్ 2తో యంగ్ టైగర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో  స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలిసింది.  ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.  బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ చేసిన ట్వీట్ లో ‘వార్ 2’ పై పరోక్షంగా క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.

ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే.. షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ.. వార్ 2 రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఎప్పుడంటే.. 2025 జనవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నట్లు కూడా టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular