Friday, May 31, 2024
HomeసినిమాCounter: ఆ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన మహేష్ ఫ్యాన్స్

Counter: ఆ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన మహేష్ ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేస్తారు. అలాగే నచ్చిన పాత్ర కోసం ఎంత కష్టమైనా.. ఎంత రిస్క్ అయినా చేయడానికి రెడీ అంటారు. అయితే.. ఇటీవల ఓ వెబ్ సైట్ లో మహేష్ బాబు ఎక్కువుగా కష్టపడడానికి ఇష్టపడరని…. ‘మహర్షి’ లో గేదలతో ఫైట్ ని కూడా ఏసీ ఫ్లోర్ లో సెట్ వేయించి చేయించారని.. అంత సుకుమారంగా ఉంటారని రాశారు. అంతే కాకుండా.. అంతటి సుకుమారుడుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి జక్కన్నకు చాలా ఈజీ అని.. రాశారు. అంటే రాజమౌళి కూడా మహేష్ కు తగ్గట్టుగా భారీగా ఉండే ఫైట్స్ కాకుండా సింపుల్ గా ఉండే యాక్షన్ సీన్స్ తో సినిమా తీస్తాడన్నట్టుగా రాశారు.

ఇది మహేష్ అభిమానులకు బాగా కోపం వచ్చింది. మహేష్‌ బాబు సెట్ లో ఎంత కష్టపడతాడో కొంత మంది నటులు గతంలో చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సునీల్, సుబ్బరాజు తదితర నటులు ఏం చెప్పారంటే.. మహేష్ తన చేతికి గాయం అయినప్పటికీ ఏం ఫరవాలేదు సీన్ చేసేద్దాం అంటాడు. అంతే కాకుండా యాక్షన్ సీన్ చేయాలి….అక్కడ నుంచి దూకాలి అంటే చేసేద్దాం అంటాడు. అంత డెడికేటెడ్ గా వర్క్ చేసే హీరోని ఇంత వరకు చూడలేదు అంటూ సునీల్, సుబ్బరాజు చెప్పిన వీడియోలను పోస్ట్ చేయడం అవి వైరల్ అవ్వడం జరిగింది.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. అయితే.. ఫస్ట్ ఫైట్ మాస్టర్ బాగా కష్టపెట్టాడట. అందుకనే మహేష్‌ ఆ ఫైట్ మాస్టర్ ని మార్చేశాడు అని కూడా రాశారు. ఫైట్స్ చేయలేక కాదు… ఆ కథతోనే పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోవడంతో మార్చేయడం జరిగిందని టాక్. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా మరో ఫైట్ మాస్టర్ ఫైట్స్ డిజైన్ చేశారు. ఈ ఫైట్స్ బాగా వచ్చేయని తెలిసింది. మొత్తానికి మహేష్ పై వచ్చిన విమర్శలకు అభిమానులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్