Wednesday, January 22, 2025
HomeTrending Newsనడ్డాతో ఈటెల భేటి!

నడ్డాతో ఈటెల భేటి!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపి వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తాజా రాజకీయాలు, పార్టీలో చేరిక ఎప్పుడు, ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు అనే అంశాలపై ఈటెల నడ్డాతో చర్చించినట్లు తెలుస్తోంది.

బిజెపిలో చేరేందుకు ఈటెల నిర్ణయం తీసుకుంటే హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎవరు పోటీ చేయాలి అనే అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కూడా కలవాలని ఈటెల ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ను ఈ దఫా కలిసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్