Monday, June 8, 2026
HomeTrending Newsరాయపూర్ రైల్వే స్టేషన్లో పేలుడు

రాయపూర్ రైల్వే స్టేషన్లో పేలుడు

చత్తీస్ ఘడ్  రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఉదయం జరిగిన పేలుడులో ఆరుగురు సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఝార్సుగూడా నుంచి జమ్మూ తావి వెళ్తున్న రైలులో పెద్ద సంఖ్యలో సెంట్రల్ సెక్యూరిటీ  ఫోర్స్ జవాన్లు ఉన్నారు. డిటోనేటర్స్ తో జరిగిన బ్లాస్ట్ జరిగిందని ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ చౌహాన్ ను రాయ్ పూర్ లోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 65, 80, 211 బెటాలియన్ లకు చెందిన సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు రైలులో ఉన్నాయి. దుర్ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular