Saturday, November 23, 2024
HomeTrending NewsBomb threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Bomb threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం.. ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ ఓ అగంతకుడి మెయిల్‌ చేశాడు. దీంతో అలర్టయిన ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఎయిర్‌పోర్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సోమవారాం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్‌ రాగా.. విషయం ఆలస్యంగా బయటపడింది. నిన్న ఉదయం 11గంటల 50 నిమిషాలకు గుర్తుతెలియని వ్యక్తి  విమానాశ్రయంలో బాంబు ఉందంటూ కంట్రోల్‌ రూమ్‌కు మెయిల్ పెట్టాడు. రాత్రి 7గంటలకు బాంబు పేలుతుందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు  పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ పెంచారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు  నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.

బెదిరింపు మెయిల్‌ వచ్చిన కాసేపట్లో.. మరో మెయిల్‌ వచ్చింది. తప్పు జరిగిందని.. తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్‌, మెసేజ్‌లు పెట్టాడంటూ వేరే ఐడీతో మెయిల్‌ పెట్టాడు గుర్తుతెలియని వ్యక్తి. అంతేకాదు… తనను క్షమించాలంటూ కోరాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు. ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూమ్‌కి వచ్చిన మెయిల్స్‌ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. రెండు మెయిల్స్‌ పెట్టింది ఒక వ్యక్తేనా… కాదా…? అన్నది ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్