Saturday, March 7, 2026
Homeసినిమా‘పుష్ప ది రైజ్‌’ ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్

‘పుష్ప ది రైజ్‌’ ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్

Eyy Bidda: Trending
ఆర్య‌, ఆర్య‌-2 సినిమాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న ‘పుష్ప’ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్.

వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా‘ అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. డిసెంబ‌ర్ 17న పుష్ప ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బ‌న్నీ, సుక్కుల ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

Also Read  :‘పుష్ప‌’లో స‌మంత‌ ఐటం సాంగ్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular