విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్-3’. లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని అఫిషియల్ గా తెలియచేస్తూ.. చిత్రయూనిట్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫోటోలో దర్శకుడు అనిల్, నటులు వెంకటేష్, వరుణ్, సునీల్ నవ్వుతూ కనిపించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్-2’ ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘ఎఫ్-3’ సునీల్ ఓ ప్రత్యేక పాత్ర పోస్తిస్తున్నారు.
ప్రేక్షకులు ఎన్ని అంచనాలతో వచ్చినా.. అంతకు మించి అనేలా ‘ఎఫ్-3’ ఉంటుందని.. ఖచ్చితంగా వినోదాన్ని అందిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ..డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.