Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Only Fun: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3‘. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది.

సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే వున్నారు. ఎఫ్ 2 తర్వాత ఇంత హాయిగా నవ్వుకున్న సినిమా ఎఫ్ 3 అని సెన్సార్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో చిత్ర సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

F3 Team

“దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పనిచేస్తే ఒత్తిడి వుండదు. ఆయన స్క్రిప్ట్ చెప్పినపుడే సినిమా చూసినట్లు వుంటుంది. వెంకటేష్ గారి పాత్ర గురించి చెప్పినపుడు ఆయనలానే యాక్ట్ చేశారు. వరుణ్ తేజ్ పాత్ర చెప్పినపుడు వరుణ్ లా చేస్తారు. చివరికి హీరోయిన్ పాత్రలు కూడా నటించేస్తారు, నిజానికి అనిల్ లో గొప్ప నటుడు వున్నారు. ఆయన అంత చక్కగా నటించి చెప్పడం వలన సినిమా టైమింగ్ తెలిసిపోతుంది. అలాగే ఆయన చాలా ఫాస్ట్ గా సినిమా తీస్తారు. ఎఫ్ 2 విషయానికి వస్తే.. ఎక్కువ సిట్యుయేషనల్ సాంగ్స్. ఎఫ్3లో సిట్యుయేషనల్ గానే కాకుండా జనరల్ గా కనెక్ట్ అయ్యే సాంగ్స్ చేశాం. ‘లబ్ డబ్ డబ్బు’, ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ పాటలు కథలో భాగం అవుతూనే అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటాయి.

పాట‌ల విష‌యానికి వ‌స్తే.. లబ్ డబ్ డబ్బు కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఉ ఆహా.. లైఫ్ అంటే ఇట్లా వుండాలా.. పాటలు కూడా డిఫరెంట్ గా ఉంటూ చాలా కొత్తగా వున్నాయని ఆడియన్స్ ఫీలయ్యారు. అన్నిటికంటే దర్శకుడు అనిల్ రావిపూడి గారు సినిమా రీరికార్డింగ్ అంతా చూసి.. “అద్భుతంగా చేశారు. మీకు వంద హగ్గులు వంద ముద్దులు” అన్నారు. దర్శకుడు ఆ మాట చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

Pooja Hegde Special Song
దిల్ రాజు గారితో నాది ఒక నిర్మాత – సంగీత దర్శకుడి అనుబంధం అనే కంటే ఒక కుటుంబం అనొచ్చు. ఆయనతో నాకు నచ్చేది సినిమా పట్ల ప్యాషన్. ఆయన చూడని సక్సెస్ లేదు. కానీ ప్రతి సినిమా ఆయన ఫస్ట్ మూవీలానే ఎక్సయిట్ అవుతారు. ఆయన ప్రొడక్షన్ లో చేసే ప్రతి సినిమాకి సంబధించి మ్యూజిక్ గురించి నాతో మాట్లాడుతుంటారు. నా అభిప్రాయం అడుగుతారు. నా జడ్జిమెంట్ పట్ల ఆయనకి మంచి నమ్మకం. మేము సినిమా గురించే మాట్లాడుకుంటాం. సినిమా బావుంటే అది ఎవరిదైనా మెచ్చుకునే గుణం మా ఇద్దరిలో వుంది. సినిమా పట్ల మా ఇద్దరికి వున్న ప్యాషనే మంచి విజయాలకి కారణమని భావిస్తాను” అన్నారు.

Also Read : ‘ఎఫ్3’ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com