Thursday, April 25, 2024
Homeసినిమామే 27 ప్రేక్షకులకు నవ్వుల పండగే : ఎఫ్3 టీమ్

మే 27 ప్రేక్షకులకు నవ్వుల పండగే : ఎఫ్3 టీమ్

More Fun: విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో రూపొందిన భారీ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఎఫ్ 3. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ ‘ఎఫ్3’ థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఫన్ బ్లాస్ట్ ‘ఎఫ్3’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎఎంబీ సినిమాస్ లో నిర్వహించారు.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 అద్భుతమైన నవ్వులు పంచాలని సినిమా చేశాం. కోవిడ్ తర్వాత నా రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్ 3 తో మీ అందరినీ థియేటర్ లో కలుసుకోవడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ అంతా కలసి సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ “ఎఫ్2 మాకు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటింది. ఎఫ్ 3 మెయిన్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో సిక్స్ కాదు బాల్ స్టేడియం బయటికి వెళుతుంది. కోవిడ్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనందరికీ నవ్వులు తీసుకొచ్చే చిత్రం మాత్రం ఎఫ్ 3. వెంకటేష్ గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఎఫ్ 2కి మించి ఎంజాయ్ చేశాం” అన్నారు.

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ  “ఎఫ్ 3 ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడం గ్రేట్ ఎనర్జీ ఇచ్చింది. ఎఫ్2 కి మించి ఎఫ్ 3 సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు. ఎఫ్ 3 లో మూడో ఎఫ్ కి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ. ఎఫ్2 ఆదరించిన అందరూ మా ఫ్యామిలీనే. ఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళినపుడు ఒక థియేటర్ లో సినిమా రెస్పాన్స్ చూశా. ఒక ఫ్యామిలీ మొత్తం వరుసలో కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకోవడం చూశాను. ఒకరిని నవ్వించడం ఎంత కిక్ వుంటుందో అప్పుడు అర్ధమైయింది. అందుకే ఎఫ్ 3ని స్టార్ట్ చేశా. ఈ సినిమాని మీరు ఆదరిస్తే ఎఫ్ 4 తీయడానికి కూడా రెడీ…శిరీష్ గారు ఇప్పటికే సినిమాని 20 సార్లు చూస్తుంటారు. ఎప్పుడు చూసిన ఫస్ట్ టైం చుసినట్లే తెగ నవ్వుకుంటారు. ట్రైలర్ చూసి ఎంత నవ్వుకున్నారో సినిమా చూసి అంతకు మించి నవ్వుకుంటారు ప్రామిస్” అన్నారు.

Also Read : ఎఫ్ 3 రిలీజ్ కాకుండానే.. ఎఫ్ 4 ప్లాన్ చేస్తున్నారా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్