Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీలోకి మలయాళం నుంచి మరో బ్లాక్ బస్టర్!

ఓటీటీలోకి మలయాళం నుంచి మరో బ్లాక్ బస్టర్!

మలయాళ ఇండస్ట్రీ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్లను నమోదు చేస్తూ వెళుతోంది. ఫిబ్రవరిలో వచ్చిన మూడు సినిమాలు సంచలన విజయాలను అందించాయి. ‘భ్రమ యుగం’ .. ‘ప్రేమలు’ .. ‘మంజుమ్మల్ బాయ్స్’ .. ఈ మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ నుంచి వచ్చాయి. మూడు కూడా అని తరగతుల ప్రేక్షకులను అలరించాయి. ఈ ఏడాది ఆరంభంలోనే మలయాళ ఇండస్ట్రీ గురించి అంతా మాట్లాడుకునేలా చేశాయి.

విశేషం ఏమిటంటే ఈ మూడు సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందినవే. ‘భ్రమ యుగం’ .. ‘ప్రేమలు’ సినిమాలు 100 కోట్ల వసూళ్లను దాటితే, ‘మంజుమ్మల్ బాయ్స్’ 200 కోట్ల మార్కును దాటేసింది. ఆ సక్సెస్ లను ఇండస్ట్రీ మరిచిపోకముందే ఇప్పుడు మరో ఇండస్ట్రీ హిట్ పడింది. ఆ సినిమా పేరే ‘ఆవేశం’. ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 11వ తేదీన విడుదలైంది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోయింది.

జితూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, చాలా వేగంగా 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఈ రోజు నుంచే ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే మిగతా భాషలలోను ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్