Monday, May 20, 2024
Homeసినిమాకొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టేసిన విజయ్ దేవరకొండ! 

కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టేసిన విజయ్ దేవరకొండ! 

విజయ్ దేవరకొండ ‘లైగర్’ కోసం చాలా సమయాన్ని కేటాయించాడు. అయితే ఆ ప్రాజెక్టు కోసం అతను కేటాయించిన సమయం వృథా అయింది. దాంతో మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయనకి చాలా సమయం పట్టింది. ఆ సినిమా తరువాత ఆయన చేసిన ‘ఖుషీ’ .. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పుట్టినరోజు వచ్చేసింది.

ఈ రోజున విజయ్ దేవరకొండ పుట్టినరోజు. దాంతో ఆయనకి విషెస్ చెబుతూ, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన మేకర్స్ అందుకు సంబంధించిన ప్రకటనలు వదులుతున్నారు. విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడనే విషయం ఈ సందర్భంలోనే తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

దీని తరువాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో ఈ దర్శకుడి నుంచి  ‘రాజావారు రాణిగారు’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రాజెక్టును కూడా విజయదేవరకొండ లైన్లో పెట్టేశాడు. ఈ ప్రాజెక్టును ఆయన రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘టాక్సీవాలా’ హిట్ ఉన్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్