మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. డెంగ్యు బారిన పడ్డ 89 ఏళ్ల మన్మోహన్ కు ఢిల్లీ లోని AIIMS లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మన్మోహన్ చనిపోయారని పోస్టులు పెడుతున్నారు. జార్ఖండ్ కు చెందిన ఓ మంత్రి మాజీ ప్రధానికి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని తొలగించారు.
మాజీ ప్రధాని క్రమంగా కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఏ ఐ సి సి కార్యదర్శి ప్రణవ్ ఝ ట్వీట్ చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. కాగా మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఈ రోజు రాహుల్ గాంధీ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.