Thursday, November 21, 2024
Homeఫీచర్స్కష్టాల నడుమ సంతోషాలకు దారేది?

కష్టాల నడుమ సంతోషాలకు దారేది?

Family Counselling :

Q.నా వయసు ౩౦ సం. ఇంకా పెళ్లి కాలేదు. మాది మధ్యతరగతి కుటుంబం. నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న రిటైరయ్యారు. అమ్మకి వినికిడి లోపం. పెద్దక్క విడాకులు తీసుకుంది. తనకి ఒక బాబు. చిన్నక్క వికలాంగురాలు. అన్నయ్య ఏ బాధ్యతా తీసుకోకుండా తాగుతూ ఉంటాడు. పైగా తన జల్సాలకు డబ్బుల కోసం అమ్మానాన్నల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నేను ప్రైవేటుగా ఎంకామ్ చేస్తూ బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు పెళ్లి కావాలనే ఆశ లేదు. కానీ నా కుటుంబం గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఉంది. ఏం చేయాలి?
-కృతి

A.మధ్యతరగతి కుటుంబాల్లో ఎగుడు దిగుళ్ళు సహజం. అయితే ఈ రోజుల్లో చిన్న చిన్న పనులు చేసేవారు కూడా ముందు జాగ్రత్తతో జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నారు. కొన్నిసార్లు కుటుంబ పెద్ద ఉద్యోగరీత్యా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీ అక్కలిద్దరూ చదువుకుని స్వావలంబన సాధించవచ్చు కదా! ఇక మీ అన్నయ్య .. అతను ఏం చదివాడో మరి. బాధ్యత లేకుండా తయారవడానికి మీ నాన్నగారి అమాయకత్వం,అమ్మగారి అసహాయత కూడా కారణం అయి ఉండచ్చు. లేదా మీరంతా ఒకటై తనని సరిగా చూడటం లేదని అనుకుంటున్నాడో . ఇన్ని కష్టాల మధ్య కూడా వారంతా సంతోషంగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు కదా, అదీ అసలైన మధ్యతరగతి ఆడపిల్ల మనసు. మీ అక్కచెల్లెళ్ళు ముగ్గురూ కలసి అన్నయ్యతో మాట్లాడండి.అతని అవసరం కుటుంబానికి ఎంత ఉందో వివరించండి. ఎంతయినా మీ అన్నయ్యే కదా!చెల్లెళ్ళ మాట తప్పక వింటారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా అందరూ తలా ఒక వ్యాపకం కల్పించుకుంటే గొడవలకు సమయమే ఉండదు.ఆ దిశగా ఆలోచించండి .

Family Counselling

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

Also Read:

కోపాన్ని జయించేదెలా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్