Family Counselling :
Q. నేను ఎనిమిది సంవత్సరాలుగా ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతను కూడా నేనంటే చాలా ప్రేమగా ఉంటాడు. మా కులాలు వేరు. అయినా ఇంట్లో పెద్దవారితో చెప్పాం. ఒప్పుకుంటేనే పెళ్లి. ఈలోగా అతనికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. అడిగితే అనుకోకుండా జరిగిందని, నన్ను బాగా చూసుకుంటానని అంటున్నాడు. అందరూ అతనిగురించి మంచిగానే చెప్తారు. నాకూ అతన్నే చేసుకోవాలని ఉంది. కానీ నా అంత సిన్సియర్గా అతను ప్రేమించడం లేదేమోనని ఎక్కడో అనిపిస్తోంది. అతనికి తల్లిదండ్రులు లేరు. నాదేమో పెద్ద కుటుంబం. ఆస్తి కూడా బాగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడం లేదు.
-చిన్ని
A. ఓ పక్క అతన్నే చేసుకోవాలని ఉంది…అందుకే క్షమార్హం కాని తప్పు చేసినా క్షమిద్దాం అనుకుంటున్నారు. మరోపక్క పెళ్లయ్యాక ఇలా
ఉంటే ఎలా అనే సందిగ్ధం..ఎందుకొచ్చిన కష్టాలు? పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తే సరి అని మరోపక్క…అంటే మీకే స్థిరమైన అభిప్రాయం లేదు. అతన్ని చేసుకుంటే ఒకలా చేసుకోకపోతే ఇంకోలా మనసుని మభ్యపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంత కష్టపడకండి. పెళ్ళికి ముందే తప్పు చేసి నిర్భయంగా ఒప్పుకున్నాడు అంటే మరోసారి అదే దారిలో వెళ్ళడని ఏంటి? ఇలా భయంతో అనుమానంతో పెళ్లి చేసుకున్నా మనశ్శాంతి ఉండదు. అంచేత అతనితో తెగతెంపులు చేసుకుని పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటే మేలేమో!ఆలోచించండి.
Family Counselling
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]
Also Read:
Also Read: